ఇండియన్ సినిమాలో అత్యంత బిజీగా ఉండే నటుల్లో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకరు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు, ఇటీవల వచ్చిన ‘సార్’, ‘కుబేర’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దాంతో ధనుష్ త్వరలోనే మరొక ప్రత్యక్ష తెలుగు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘సార్’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ కాంబినేషన్లోనే ఈ కొత్త ప్రాజెక్ట్ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.
గతంలో ‘లబ్బర్ పందు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తమిళ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ధనుష్ కూడా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న వినోదాత్మక కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. ఇక ధనుష్ నటించిన ‘OM’ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
Displaying Srikanth-2.jpg.jpeg.
