కోలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన ధనుష్ హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కించిన చిత్రమే ‘కర’. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా తాలూకా తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది.
అయితే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మేకర్స్ ఇప్పుడు విడుదల చేయగా ఈ ట్రైలర్ ని ఇప్పుడు విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ లో ధనుష్ ఒక దొంగగా కనిపిస్తున్నాడు. అలానే గల్ఫ్ దేశాల్లో మారిన పరిస్థితులు ఇక్కడ ఎలా ప్రభావం చూపించాయి అనే అంశంతో మొదలైన సినిమా ధనుష్ రోల్ పై ఇంట్రెస్టింగ్ సీన్స్ తో కొనసాగింది.
ఇక కర పాత్రలో ధనుష్ తనదైన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇందులో చూపించినట్టు ట్రైలర్ తో అర్ధం అయ్యిపోతుంది. అలాగే మమితా బైజు కూడా ధనుష్ భార్య పాత్రలో డీ గ్లామ్ లుక్ లోకి మారి ఆమె కూడా మంచి పెర్ఫామెన్స్ ని ఇచ్చేలా ఉందని చెప్పవచ్చు. అలానే ఇందులో సంగీతం, కెమెరా వర్క్ లు కూడా సినిమా మూడ్ కి తగ్గట్టుగా నాచురల్ గా కనిపిస్తున్నాయి. సో ఈసారి ధనుష్ ఎలాంటి ట్రీట్ అందిస్తాడో తెలియాలి అంటే ఈ ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందే.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
