త్వరలో ట్రైలర్ తో రానున్న ధనుష్ !

Dhanush
వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ స్టార్ నటుడు ధనుష్ నటిస్తున్న చిత్రం వడచెన్నై ఈ చిత్ర ట్రైలర్ ని జులై 28 రిలీజ్ చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ధనుష్ ఈ చిత్రంలో జాతీయ స్థాయి క్యారమ్ ప్లేయర్ గా నటిస్తున్నాడు ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఐశ్వర్య రాజేష్ , ఆండ్రియా కథానాయికలు గా నటిస్తున్నఈ సినిమా 35 సంవత్సరాల క్రితం ఉత్తర చెన్నై లోని ప్రజల జీవిత నేపథ్యంతో తెరకెక్కుతుంది . సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నీ లైకా ప్రొడక్షన్స్ డిస్ర్టిబ్యూట్ చేయనుంది. ఇక ధనుష్ సినిమాల్లో నటిస్తూనే వరుసగా చిత్రాలను నిర్మిస్తున్నారు .తన మావయ్య రజిని నటించిన కాలా చిత్రాన్నీ కూడా ఆయనే నిర్మించారు .

Exit mobile version