ధనుష్ కొత్త చిత్రం “నానే వరువేన్” సినిమా షూటింగ్ పూర్తి

Published on Apr 11, 2022 8:27 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తదుపరి చిత్రం నానే వరువేన్. ఎల్లి అవ్రామ్ మరియు ఇందుజా రవిచంద్రన్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు, ధనుష్ సోషల్ మీడియా ద్వారా తన తదుపరి చిత్రం కి సంబంధించిన ఒక విషయాన్ని వెల్లడించారు.

తన సోషల్ ప్రొఫైల్‌లను తీసుకొని నానే వరువెన్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక సరికొత్త స్టైలిష్ పోస్టర్ ను షేర్ చేశారు. ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా నటిస్తున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ కథానాయకుడిగానే కాకుండా విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :