ధనుష్ “సార్” నుండి లేటెస్ట్ అప్డేట్!

ధనుష్ “సార్” నుండి లేటెస్ట్ అప్డేట్!

Published on Oct 23, 2022 4:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సార్/వాతి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా సమాచారం ఏమిటంటే, ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ రేపు 09:00 గంటలకు విడుదల కానుంది.

ఈ పోస్టర్‌లో సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. మరి విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ ఉందో లేదో వేచి చూడాలి. ఈ ద్విభాషా చిత్రంలో ధనుష్‌ సరసన హీరోయిన్ గా సంయుక్తా మీనన్ నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకరా స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు