ధనుష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…”సార్” ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కి రెడీ!

Published on Jul 25, 2022 6:30 pm IST

సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ ధనుష్ రీసెంట్ గా రుస్సో బ్రదర్స్ హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ లో లోన్ వోల్ఫ్ గా అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు. సార్/వాతి అనే తెలుగు – తమిళ సినిమాలో తన అద్భుతమైన నటనతో మళ్లీ తన అభిమానులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ లకి సంబందించిన రిలీజ్ డేట్ ల పై అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్ర ఫస్ట్‌ లుక్ మరియు టీజర్‌ను వరుసగా జూలై 27 మరియు 28, 2022 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు కొత్త పోస్టర్ కూడా షేర్ చేయడం జరిగింది. ఈ ద్విభాషా చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :