ధనుష్ “సార్” ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్!

ధనుష్ “సార్” ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్!

Published on Nov 6, 2022 7:09 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం వాతి/సార్ నుండి ఫస్ట్ సింగిల్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. నవంబర్ 10న పాటను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ధనుష్ మరియు హీరోయిన్ సంయుక్తా మీనన్ ఉన్న ఒక కూల్ పోస్టర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధనుష్‌కి ఇదే తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు