ధనుష్ “సార్” వాయిదా పడిందా?

ధనుష్ “సార్” వాయిదా పడిందా?

Published on Nov 4, 2022 3:00 AM IST


డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం సార్/వాతి. ఈ చిత్రం లో ధనుష్ సరసన హీరోయిన్ గా సంయుక్తా మీనన్ నటిస్తుంది. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. డిసెంబరు 2న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

2023 ఫిబ్రవరి నెలలో సినిమా విడుదల కానుందన్న మాట. ఈ సినిమాలో సాయి కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు