కొత్త చిత్రం సార్ సినిమా షూటింగ్ మొదలెట్టిన ధనుష్!

Published on Jan 3, 2022 12:55 pm IST


ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సార్. ఈ చిత్రం వాతి పేరుతో తమిళం లో, తెలుగు లో సార్ గా విడుదల కానుంది. ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ ఫస్ట్ పోస్టర్ విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ పై నేడు క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ను నేడు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :