వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “సార్”

Published on May 26, 2023 11:02 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం సార్/వాతి. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను కూడా రాబట్టడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో జూన్ 4 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రం లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, టాలీవుడ్ నటుడు సుమంత్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి

సంబంధిత సమాచారం :