‘చిరంజీవి’ కోసం షూటింగ్ ను వాయిదా వేసుకున్న ‘ధరమ్ తేజ్’

17th, August 2016 - 12:39:50 PM

chiru-sai-dharam-tej
ఇన్నాళ్లు ‘మెగాస్టార్ చిరంజీవి’ సినిమాలకు దూరంగా ఉండటంతో ఆయన వారసుల సినిమాలతో కాలక్షేపం చేసిన ఆయన అభిమానులంతా చిరు150వ చిత్రం మొదలుపెట్టగానే యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు. ఆగష్టు 22న రాబోయే చిరంజీవి పుట్టినరోజును రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రకరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ పుణ్య క్షేత్రాల్లో ‘నవ జన్మ పూజ మహోత్సవాలు’ పేరుతో పూజలను నిర్వహిస్తున్నారు.

అందులో భాగాంగా ఈరోజు అంతర్వేదిలో జరగబోయే పూజా కార్యక్రమాలకు, వేడుకలకు మెగా ఫ్యామిలీ నుండి ‘సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్’ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు అభిమానాలు. తేజ్ కూడా వారి ఆహ్వానాన్ని స్వీకరించి చిరంజీవి కోసం ప్రస్తుతం చేస్తున్న ‘నక్షత్రం’ సినిమా షూటింగ్ సైతం వాయిదా వేసుకుని మరీ ఆ కార్యక్రమానికి హాజరుకానున్నాడు. ‘కృష్ణ వంశీ’ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధరమ్ తేజ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించనున్న సంగతి తెలిసిందే.