డిసెంబర్లో విడుదలకానున్న మెగా హీరో సినిమా ?

19th, October 2017 - 11:56:14 AM

యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన సినిమా ‘జవాన్’. రచయిత బివిఎస్ఎన్ రవి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని పనుల్ని పూర్తిచేసుకుంది. మొదటి సెప్టెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని చెప్పినా కొన్ని అనివార్య కారణాల వలన అది కాస్త వాయిదాపడింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 1న ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ వార్తపై పూర్తి క్లారిటీ రావాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వచ్చి చూడాల్సిందే. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా కనిపించనుంది. తేజ్ ఈ సినిమాలో దేశమా, కుటుంబమా అనే సంఘర్షణను ఎదుర్కునే ఒక భాద్యత గల యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే వినాయక్ దర్శకత్వంలో తేజ్ ఇటీవలే మొదలుపెట్టిన చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.