మెగా హీరో సినిమా షూటింగ్ మొదలు !

12th, December 2017 - 03:10:24 PM

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వివి.వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కరుణాకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో మొదలైంది. ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నారు.

గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్సియల్స్ బ్యానర్ పై కే.ఎస్.రామారావ్ నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరితో తెరకెక్కే ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ విజయం సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ‘తొలిప్రేమ’ చిత్రంతో పవన్ కళ్యాణ్‌కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎ.కరుణాకరన్‌ ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కు ఆ స్థాయి హిట్ ఇస్తాడేమో చూద్దాం.