దసరా నుండి మొదలుకానున్న మెగా హీరో సినిమా !


మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో దర్శకుడిగా గ్రాండ్ సక్సెస్ అందుకున్న వి.వి. వినాయక్ ప్రస్తుతం మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఆగష్టు నెలలో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయినా ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ 27 నుండి మొదలుకానుంది.

ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను ఎక్కువ భాగం యూఎస్ నైపథ్యంలో ఉండటం వలన షూటింగ్ కూడా ఎక్కువగా అక్కడే జరుగుతుందట. ప్ర్తముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రంలో తేజ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఈ సినిమాకు ‘దుర్గ, ఇంటెలిజెంట్’ వంటి టైటిల్స్ ప్రచారంలో ఉండగా ఇంకా దేన్నీ ఫైనల్ చేయలేదు. ఇకపోతే తేజ్ నటించిన ‘జవాన్’ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.