టీజర్ తో సందడి మొదలుపెట్టిన మెగా హీరో!

winner
ఈ సంవత్సరం చిరు ‘ఖైదీ నెం 150’, పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సంక్రాంతివిశేష్ పోస్టర్లతో సందడి చేస్తున్న తరుణంలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన ‘విన్నర్’ చిత్రం తాలూకు టీజర్ తో ఈరోజు పొద్దుపొద్దున్నే సందడి మొదలుపెట్టేశాడు. కాసేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ మెగా అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

హార్స్ రేస్ ను ప్రధాన అంశంగా హైలెట్ చేస్తూ రూపొందించిన ఈ టీజర్లో ధరమ్ తేజ్ గత సినిమాలు కన్నా కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. పైగా డైలాగులు కూడా కొత్తగా రిఫ్రెషింగా ఉన్నాయి. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ పలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిచాడు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి: