లేటెస్ట్..యూఎస్ లో ధరణి గాడి మాస్ ర్యాంపేజ్.!

Published on Apr 1, 2023 9:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సెన్సేషనల్ మాస్ పాన్ ఇండియా సినిమా “దసరా”. భారీ హైప్ ప్రమోషన్స్ మధ్య వచ్చిన ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా మరియు బిగ్గెస్ట్ హిట్ దిశగా ఇప్పుడు కొనసాగుతుంది. మరి ధరణి గా మాస్ విశ్వ రూపాన్ని చూపించిన నాచురల్ స్టార్ నాని వసూళ్లతో మాస్ ర్యాంపేజ్ ని ఇప్పుడు సృష్టిస్తున్నాడు.

లేటెస్ట్ గా అయితే యూఎస్ లో అప్డేటడ్ వసూళ్లు డిస్ట్రిబూస్టర్స్ రివీల్ చేశారు. నిన్న రాత్రికే 1 మిలియన్ మార్క్ ని కొట్టేసిన ఈ చిత్రం అక్కడ రెండో రోజు సాయంత్రం 7 గంటలు నాటికి అయితే 1.12 మిలియన్ డాలర్స్ మార్క్ కి చేరుకొని దుమ్ము లేపుతుంది. దీనితో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ యూఎస్ లో మరింత స్ట్రాంగ్ రన్ దిశగా దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :