మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటించిన జైలర్ 2 కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మాస్ స్పీడ్ తో పూర్తి చేసిన తలైవర్ దీని తర్వాత యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కలయికలో చేస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రమే ‘ధర్మన్’.

ఇందులో రజినీకాంత్ ఒక డెడ్లి డాక్టర్ గా కనిపించనుండగా ఈ సినిమాని కూడా సూపర్ స్టార్ సూపర్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నారు. ఇలా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ లోకి సినిమా వచ్చినట్టు మేకర్స్ సింపుల్ అప్డేట్ ని ఇప్పుడు రివీల్ చేశారు కానీ దీనిపై వదిలిన ప్రోమో కట్ మాత్రం వేరే లెవెల్ మాస్ గా ఉంది.

రజినీని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తున్నట్టుగా అనిరుద్ మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ని గ్యారెంటీ అనేలా ఈ ప్రోమోతో అప్డేట్ ని సెట్ చేశారు. సో ఇలా ధర్మన్ పై అభిమానులకి అప్డేట్ అందించారు. ఇక ఈ చిత్రంలో సిమ్రాన్, రాశిఖన్నా అలాగే యోగిబాబు తదితరులు నటిస్తుండగా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version