మరో ఓటిటిలో కూడా ‘ఢీ 21’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!

మన తెలుగు బుల్లితెర దగ్గర సూపర్ హిట్ అయినటువంటి పలు పాపులర్ రియాలిటీ షోస్ లో డాన్స్ నేపథ్యంలో వచ్చిన హిట్ షో ‘ఢీ’ కూడా ఒకటి. ప్రముఖ ఛానెల్ ఈటీవీలో రెండు దశాబ్దాలు పాటు విజయవంతంగా టెలికాస్ట్ అయ్యిన ఈ షో ఇప్పుడు డిజిటల్ గా అలరించేందుకు సిద్ధం అయ్యిన సంగతి తెలిసిందే.

దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఢీ 21వ సీజన్ ని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకురావడానికి సిద్ధం అయ్యారు. అయితే డేట్ ఎపుడు అనేది ప్రకటించలేదు కానీ ఇప్పుడు డేట్ తో పాటుగా మరో కీలక అప్డేట్ కూడా ఈ షోపై రివీల్ అయ్యింది. తాజాగా ఈ షో సమర్పకులు ఈటీవీ విన్ వారు ఢీ 21 సీజన్ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

ఈ సెప్టెంబర్ 19 నుంచి షో స్ట్రీమింగ్ కానుండగా ఈటీవీ విన్ లో కూడా ఈ షో ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఈ రెండు ఓటిటిలలో ఢీ సందడి మనం చూడొచ్చు. అలాగే ఓ పాపులర్ హీరోయిన్ ని కూడా లాంచ్ కి తెస్తున్నట్టుగా తీజ్ చేస్తున్నారు. సో ఇది కూడా రివీల్ కావాల్సి ఉంది.

Exit mobile version