అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో” నుండి ధీంతననా సాంగ్ ప్రోమో రిలీజ్!

అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో” నుండి ధీంతననా సాంగ్ ప్రోమో రిలీజ్!

Published on Oct 7, 2022 10:47 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో. ఈ చిత్రం లో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ అక్టోబర్ 10, 2022 న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో సాంగ్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది.

ధీంతననా అనే టైటిల్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ సాంగ్‌ని మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది. మ్యూజికల్ ప్రోమో చాలా రొమాంటిక్‌గా ఉంది. ట్రాక్ త్వరలో ప్లేలిస్ట్‌లను శాసించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 4, 2022న విడుదలవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రాకేశ్ శశి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి GA2 పిక్చర్స్ నిర్మించారు. అచ్చు రాజమణి, అనుప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ షురూ చేయడం తో, సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు