సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్కున్న ధీర..!

Published on Jun 11, 2022 2:30 am IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ మంచి పేరును తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’, ‘ధీర’ సినిమాలు చేస్తున్న లక్ష్ చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం తాజాగా వైజాగ్‌లో 15 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ రెండో షెడ్యూల్‌లో కొన్ని సుందరమైన లొకేషన్లలో ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించారు. ఇక ఈ చిత్రాన్ని’శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్, బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత పద్మావతి చదలవాడ నిర్మిస్తుండగా, ‘చదలవాడ బ్రదర్స్’ సమర్పిస్తున్నారు. సాయి కార్తీక్ ధీర కోసం సౌండ్‌ట్రాక్‌లను కూడా అందించారు.

సంబంధిత సమాచారం :