దుమ్మురేపుతున్న నాని ‘దసరా’ ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ సాంగ్

Published on Oct 3, 2022 6:11 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగే కథగా తెరకెక్కుతున్న దసరా మూవీలో నాని పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తుండగా ఆయనకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీ నుండి ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు.

బొగ్గు గనుల్లో హీరో, అతని స్నేహితుల బృందంపై మాస్ స్టైల్ లో చిత్రీకరించిన ఈ ఫోక్ బీట్ లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. తెలంగాణ యాసలో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాగె ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్, జంగిరెడ్డి పాడగా కబాలి మూవీ ఫేమ్ సంతోష్ నారాయణ్ దీనికి సంగీతం అందించారు. ఇక ఆయన ఈ సాంగ్ కి సూపర్ ట్యూన్ అందించగా లిరిసిస్ట్ కాసర్ల శ్యాం మరింతగా అలరించే లిరిక్స్ అందించారు. మొత్తంగా ప్రస్తుతం ఈ సాంగ్ యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీ 2023, మార్చి 30న రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :