“చరణ్ 15” లో “ధృవ” కొరియోగ్రాఫర్ తో సాలిడ్ వర్క్.!

“చరణ్ 15” లో “ధృవ” కొరియోగ్రాఫర్ తో సాలిడ్ వర్క్.!

Published on Nov 10, 2022 10:00 AM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో ఈ చిత్రం బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 15 వది కాగా దీనిపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కూడా ఇప్పుడు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

మేకర్స్ ఈ చిత్రంలో ఓ సాలిడ్ నెంబర్ ను న్యూజిలాండ్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సాంగ్ ని అయితే మేకర్స్ ఈ నవంబర్ 23 నుంచి స్టార్ట్ చేయనుండగా దీనికి అయితే రామ్ చరణ్ తో ముందుగా ధృవ లో సూపర్ ట్రాక్ నీతోనే డాన్స్ కి వర్క్ చేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ తో శంకర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మరి శంకర్ సినిమాల్లో సాంగ్స్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క సాంగ్స్ కోసమే మినీ బడ్జెట్ సినిమా రేంజ్ లో ప్లాన్ చేస్తారు. మరి ఈ సినిమాలో సాంగ్స్ విజువల్ పరంగా ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు