ఫస్ట్ లుక్ రిలీజ్ కు సిద్దమైన ‘ధృవ’

dhruva
తమిళ్ ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ చేస్తున్న చిత్రం ‘ధృవ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సురేందర్ రెడ్డి’ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. గత సినిమాలు రెండు వరుస ఫ్లాపులుగా నిలవడంతో చరణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. మెగా ఫాన్స్ సైతం ఈ చిత్రంతో చెర్రీ మంచి విజయాన్నందుకుంటాడని ఆశిస్తున్నారు.

ఈ చిత్రంలో చరణ్ ఓ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో అలరించనున్నాడు. ఇకపోతే ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి టీమ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఈ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబందించిన రిలీజ్ డేట్ పోస్టర్ కొద్ధి సేపటి క్రితమే విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ‘హిప్ హప్ తమీజా’ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన ‘రకుల్ ప్రీత్’ హీరోయిన్ గా నటిస్తోంది.