డిసెంబర్ కు వెళ్లిపోయిన రామ్ చరణ్ ‘ధృవ’

dhruva
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిసున్న ‘ధృవ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అనుకున్న తేదీ ప్రకారమైతే ఈ చిత్రం ఈ అక్టోబర్ లోనే దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న అరవింద స్వామికి ఆరోగ్యం బాగోలేకపోవడం, షూటింగ్ కూడా పూరి స్థాయిలో పూర్తవకపోవడం వంటి కారణాల వల్ల విడుదల కాస్త వాయిదా పడింది. ఆ వాయిదా తేదీ ఎప్పుడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ వాయిదా తేదీ డిసెంబర్ మొదటి వారం అని తెలుస్తోంది. ఈ వాయిదా కారణంగా కావలిసినంత టైమ్ దొరికడంతో ప్రమోషన్ల పై దృష్టి పెట్టారు టీమ్. నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ దసరా నుండి వైవిధ్యమైన రీతిలో కొత్త తరహా ప్రమోషన్లు చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. ఇకపోతే ఈ చిత్రానికి హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు.