వాతావరణానికి తగట్టు షూటింగ్ ప్లాన్ చేస్తున్న ‘చరణ్’ టీమ్

dhruva
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు పెద్ద సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. చిరంజీవి 150వ చిత్రం, రామ్ చరణ్ ధృవ, రాజమౌళి బాహుబలి – 2, పూరి – కళ్యాణ్ రామ్ ల ఇజం వంటి చిత్రాలు కీలక దశ షూటింగ్ లోఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాల కోసం భారీ స్థాయి సెట్టింగులు కూడా వేశారు. కానీ హైదరాబాద్ లో వర్షాలు భారీ స్థాయిలో కురుస్తున్నాయి. రోజులో ఎక్కువ భాగం వాతావరణం తడిగానే ఉంటోంది.

దీంతో పలు చిత్రాల షూటింగ్ కాస్త నెమ్మదించినట్లు తెలుస్తోంది. కానీ ‘రామ్ చరణ్’ నటిస్తున్న ‘ధృ’వ చిత్రం మాత్రం నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి కారణం చిత్ర యూనిట్ చేసిన ప్లాన్. వర్షం పడకుంటే అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్న టీమ్ ఒకవేళ వర్షం పడితే ఇండోర్ సన్నివేశాలను షూట్ చేస్తోంది. అంతేగాని షూటింగ్ ను మాత్రం ఆపడంలేదు. ఈ ప్లాన్ షూటింగ్ అనుకున్న టైమ్ కే పూర్తికానుంది. ఇకపోతే ‘సురేందర్ రెడ్డి’ దర్శకత్వంలో ‘అల్లు అరవింద్’ నిర్మిస్తున ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.