ట్రైలర్ తోనే దమ్ము చూపిన రామ్ చరణ్ !
Published on Nov 26, 2016 9:00 am IST

dhruva

వరుస పరాజయాల తరువాత మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ చేస్తునం చిత్రం కావడంవలన ‘ధృవ’ కు అభిమానుల్లో బోలెడంత క్రేజ్ ఏర్పడింది. మెగా అభిమానులంతా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎలా ఉండబోతోందా అంటూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పైగా ఇంతకూ ముందే విడుదలైన టీజర్, పాటలు బాగుబడటంతో ఈ క్రేజ్ మరింత పెరింది. ఇంతటి భారీ క్రేజ్ నడుమ నిన్న సాయంత్రం గీతా ఆర్ట్స్ అధినేత, చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ లు ‘ధృవ’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ విడుదలైన కాసేపటికే తాన్ ప్రభంజనం చూపడం మొదలుపెట్టింది.

అభిమానులకు కావాల్సినంత యాక్షన్, పవర్ ఫుల్ డైలాగులు, సిక్స్ ప్యాక్ బాడీతో చరణ్ అదిరిపోయే లుక్స్, మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ అన్నీ ఉండటం వలన ఈ ట్రైలర్ విడుదలైన కాసేపటికే మిలియన్ మార్క్ దాటేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అభిమానులంతా రకరకాల హాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేశారు. ఈ ట్రైలర్ చూసిన వారంతా సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 9న విడుదలకానున్న ఈ చిత్రంలో అరవింద స్వామి విలన్ గా చేస్తుండటం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ చిత్రం కానుంది.

 
Like us on Facebook