‘ధృవ’ ఫస్ట్‌లుక్ రిలీజ్‌కు రెడీ!

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలోని హాట్ టాపిక్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఈ స్థాయి స్టైలిష్ డిఫరెంట్ లుక్‌తో మరెప్పుడూ కనిపించి ఉండకపోవడంతో ‘ధృవ’ గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమా ప్రధాన కథను పరిచయం చేసేలా ఈ ఫస్ట్‌లుక్ ఉండనుందని తెలుస్తోంది.

ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు రామ్ చరణ్ స్వయంగా ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కు రీమేక్‍గా తెరకెక్కుతోంది. కార్పోరేట్ స్థాయి నేరాలను ఎదుర్కొనే ఓ పోలీసాఫీసర్ కథగా, మైండ్ గేమ్ నేపథ్యంలో సినిమా నడుస్తూ ఉంటుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.