‘ధృవ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

12th, December 2016 - 12:04:37 PM

dhruva-3rd
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా, కరన్సీ బ్యాన్ ఎఫెక్ట్‌ను కూడా ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజులు కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 21.81 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

సోమవారమైన ఈరోజు కూడా మంచి కలెక్షన్సే వస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా సినిమా ఎంత కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్‌గా నిలుస్తుంది అన్నది ఎదురుచూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నాటితరం హీరో అరవింద్ స్వామి చేసిన విలన్ రోల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ప్రాంతాల వారీగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రాంతం
కలెక్షన్స్ (షేర్-రూపాయల్లో)
నైజాం 7.21 కోట్లు
సీడెడ్
3.88 కోట్లు
ఉత్తరాంధ్ర
2.68 కోట్లు
పశ్చిమ గోదావరి
1.55 కోట్లు
తూర్పు గోదావరి
1.58 కోట్లు
కృష్ణా
1.54 కోట్లు
గుంటూరు
2.64 కోట్లు
నెల్లూరు
73 లక్షలు
మొత్తం
21.81 కోట్లు