‘పుష్ప 2’ రికార్డును లేపేసిన ‘ధురంధర్ 2’.. వెయ్యి కోట్లకు చేరువలో రణ్‌వీర్ స్పై యాక్షన్ థ్రిల్లర్

Pushpa-Vs-Dhurandhar

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అతి త్వరలో రూ.1000 కోట్ల మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉంది. రణ్‌వీర్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, హిందీ చిత్ర పరిశ్రమలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది.

ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. అక్కడ కేవలం 6 రోజుల్లోనే 16.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి, త్వరలోనే ‘బాహుబలి 2’ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇక ఇండియాలో కూడా వీక్ డేస్‌లోనూ స్ట్రాంగ్ హోల్డ్ ప్రదర్శిస్తూ, మంగళవారం నాటికి రూ.575 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. కేవలం 5 రోజుల్లోనే రూ.500 కోట్ల నెట్ మార్కును చేరి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న హిందీ చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డును చెరిపివేసింది.

ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ అద్భుతమైన మేకింగ్, రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.

Exit mobile version