Dhurandhar 2 Box-office : ‘ఉస్తాద్’ ఫీవర్‌లోనూ ‘ధురంధర్’ మోత.. హైదరాబాద్‌లో ఎక్స్‌ట్రార్డినరీ బుకింగ్స్!

Dhurandhar

హైదరాబాద్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ ద రివెంజ్’ (Dhurandhar 2) మ్యాడ్‌నెస్ పీక్స్‌కు చేరుకుంది. బుక్‌మైషోలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి.. టికెట్ల సేల్స్ ఏమాత్రం డ్రాప్ అవ్వలేదు. రోజురోజుకూ ఆ జోరు మరింత పెరుగుతూనే ఉంది. ఇది బాలీవుడ్ సినిమానా లేక మన టాలీవుడ్ టైర్-1 హీరో సినిమానా అన్నంత స్థాయిలో బుకింగ్స్ ట్రెండ్ నడుస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. మార్చి 19న టాలీవుడ్‌లో భారీ సినిమా బరిలో దిగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ ఫీవర్ నగరంలో మామూలుగా లేదు. అలాంటి టైమ్‌లో మార్చి 18న ప్లాన్ చేసిన ‘ధురంధర్ 2’ ప్రీమియర్ షోలకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) లాంటి ప్రీమియం మల్టీప్లెక్స్‌లో షోలన్నీ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌ (Prasads Multiplex) లోనూ బుకింగ్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో దూసుకుపోతున్నాయి. నగరంలోని మిగతా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో కూడా ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులే పడుతున్నాయి.

అవేవీ అడ్డంకి కాలేదు..

ఒకవైపు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్.. మరోవైపు ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 55 నిమిషాలు. దానికి తోడు సెన్సార్ బోర్డు ఇచ్చిన ‘ఏ’ (A) సర్టిఫికెట్. సాధారణంగా దాదాపు నాలుగు గంటల నిడివి ఉంటే ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ‘A’ సర్టిఫికెట్ సినిమాకు దూరంగా ఉంటారు. కానీ ఈ లెక్కలేవీ ‘ధురంధర్ 2’ క్రేజ్‌ను ఆపలేకపోయాయని ఈ ఎక్స్‌ట్రార్డినరీ బుకింగ్స్ చూస్తే స్పష్టమవుతోంది. కంటెంట్‌పై ఉన్న హైప్ ముందు అడ్డంకులన్నీ తేలిపోయాయి. కేవలం ప్రీమియర్స్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే, ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.

Exit mobile version