ప్రస్తుతం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ సెట్ చేస్తున్న బాలీవుడ్ సినిమానే “ధురంధర్” (Dhurandhar) . దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామాలో హీరోగా రణ్వీర్ సింగ్ నటించగా అక్షయే ఖన్నా విలన్ గా చేశారు. ఇక ఈ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది. భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ సినిమా కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా సాలిడ్ నంబర్స్ రాబడుతుంది.
Dhurandhar Domination in South – దక్షిణాది మెయిన్ సిటీస్ లో ‘ధురంధర్’ దంచుడు..
రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చోట్ల ధురంధర్ (Dhurandhar Movie) సత్తా చాటుతున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా హైదరాబాద్ ఇంకా బెంగళూరు సిటీ లలో ధురంధర్ భాషతో సంబంధం లేకుండా సాలిడ్ ఆక్యుపెన్సీ ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇలా ఎలాంటి డబ్బింగ్ లేకుండానే ఈ సినిమా అదరగొడుతుండడం విశేషం.
డబ్బింగ్ వెర్షన్ ల పరిస్థితి?
ప్రస్తుతానికి అయితే తెలుగు వెర్షన్ (Dhurandhar Telugu) వరకు మాత్రమే పనులు జరుగుతున్నట్టు టాక్. అది కూడా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా కన్ఫర్మ్ లేదు. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మిగతా భాషల డబ్బింగ్ అయితే ఛాన్స్ లేదనే తెలుస్తుంది.
