మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన తన లేటెస్ట్ చిత్రం పెద్ది నుంచి వచ్చిన పహిల్వాన్ టీజర్ ఓ రేంజ్ లో కిక్ ఇస్తూ పాన్ ఇండియా లెవెల్లో మరింత హైప్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ టైం వస్తున్నట్టు ఈ సాలిడ్ గ్లింప్స్ తో ఖరారు చేసేసారు. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ నార్త్ ఇండియాలో గ్రాండ్ రిలీజ్ కి ఇప్పుడు డీల్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కన్ఫర్మ్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ సినిమాని నార్త్ ఇండియాలో సెన్సేషన్ సెట్ చేసిన ధురంధర్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్ వారు పెద్ది హిందీ హక్కులు సొంతం చేసుకున్నారట. ఇది మాత్రం పెద్ది కి బిగ్ మూవ్ అనే చెప్పొచ్చు. సో హిందీలో ఈ సినిమా ఈ రేంజ్ రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
