అది చూసి క్రిష్‌ గారు ఛాన్స్ ఇచ్చారు – బుర్రా సాయిమాధ‌వ్‌

Published on Jan 10, 2022 4:40 pm IST


సీరియల్ తో తన కెరీర్ ను మొదలు పెట్టి సినిమాలకి స్టార్ రైటర్ గా ఎదిగారు బుర్రా సాయిమాధ‌వ్‌. ప్రస్తుతం ఆయన తెలుగులో ఫుల్ బిజీ రైటర్. టాలీవుడ్ లో ఇప్పుడు ఆయన హావా నడుస్తోంది. భారీ చిత్రాలన్నింటికీ బుర్రా సాయిమాధవ్ నే మాటలు అందిస్తున్నారు. కాగా తాజాగా బుర్రా సాయిమాధవ్‌ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో తన సినీ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. మొదట్లో నేను అవకాశాల కోసం ప్రయత్నించే వాడిని కాదు. ఆ సమయంలోనే నాకు సీరియల్స్‌ డైరెక్టర్‌ రాజాచంద్రవర్మ గారు పరిచయమయ్యారు.

ఆయనకు ఎవ్వరూ రాసినా నచ్చేది కాదు, ఏ రైటర్ కనెక్ట్ అయ్యేవారు కాదు. ఆయనే స్వయంగా రాసుకునే వాడు. అయితే, నా అదృష్టం బాగుండి, అయనకు నేను రాసిన డైలాగ్స్‌ చాలా బాగా నచ్చాయి. దాంతో ఆయన నన్ను రాయమన్నాడు. అలా మొదట నేను ‘అభినందన’ అనే టెలీఫిల్మ్‌ కి స్క్రిప్ట్ రాశాను. దానికి గొప్ప పేరొచ్చింది. ఆ తరువాత పుత్తడిబొమ్మ సీరియల్‌ కు రాసే ఛాన్స్ వచ్చింది. ఆ సీరియల్ చూసి క్రిష్‌ గారు నాకు ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమా రాసే ఛాన్స్ ఇచ్చారు’ అంటూ బుర్రా సాయిమాధ‌వ్‌ చెప్పారు.

సంబంధిత సమాచారం :