‘భోళా శంకర్’ కోసం మెగాస్టార్ డేట్లు ఫిక్స్ చేశాడా ?

Published on Oct 26, 2021 1:00 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ పై ఇప్పటికే అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఈ సినిమాకు ఇప్పట్లో డేట్లు ఇవ్వడం లేదు అని, చిరు ముందు గాడ్ ఫాదర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. అయితే, ఈ లాంగ్ షెడ్యూల్ ను వచ్చే నెల సెకండ్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే ఈ లాంగ్ షెడ్యూల్ కి మెగాస్టార్ కూడా డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆ మధ్య చిరు గుండు లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ లుక్ ఈ సినిమాలోదేనట. ఇక మెహ‌ర్ ర‌మేష్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేశాడు. కథలోని మెయిన్ ఎమోషన్స్ అద్భుతంగా వచ్చాయట.

పైగా ఈ సినిమాలో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి మంచి టాలెంట్ ఉంది. మరీ మెగాస్టార్ ను మెహర్ రమేశ్ ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :