రామ్ చరణ్ ఆ డైరెక్టర్‌కు ఓకే చెప్పాడా..?

రామ్ చరణ్ ఆ డైరెక్టర్‌కు ఓకే చెప్పాడా..?

Published on Feb 12, 2025 3:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో చరణ్ పాత్ర సాలిడ్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరూ ఊహించిన డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

నానితో ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శౌర్యువ్, రామ్ చరణ్‌కు ఓ స్టోరీలైన్ చెప్పినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. దీంతో శౌర్యువ్ ఈ కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో ఉన్నాడని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ నిజంగానే చరణ్ ఈ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన ఎలాంటి కథతో వస్తాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఏదైనా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు