అనుదీప్ తో సినిమాకు విశ్వ‌క్ గ్రీన్ సిగ్న‌ల్..?

అనుదీప్ తో సినిమాకు విశ్వ‌క్ గ్రీన్ సిగ్న‌ల్..?

Published on Jul 4, 2024 8:03 PM IST

‘జాతిర‌త్నాలు’ ఫేం ద‌ర్శ‌కుడు అనుదీప్ చివ‌ర‌గా శివ‌కార్తిక‌య‌న్ హీరోగా న‌టించిన ‘ప్రిన్స్’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఆ త‌రువాత ఆయ‌న నుండి మ‌రో సినిమా రాలేదు. కాగా, త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం అనుదీప్ తీవ్రంగానే క‌ష్ట‌ప‌డుతున్నాడు.

ఆయ‌న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో ఓ సినిమా చేయాలని చూడ‌గా, అది కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక మాస్ రాజా ర‌వితేజ తో త‌న నెక్ట్స్ చిత్రాన్ని తీయాల‌ని అనుదీప్ భావించాడు. కానీ, ఈ ప్ర‌య‌త్నం కూడా బెడిసి కొట్టింద‌ట‌. దీంతో ఇప్పుడు అనుదీప్ మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ కు క‌థ‌ను వినిపించాడ‌ట‌.

క‌థ న‌చ్చిన విశ్వ‌క్ కూడా అనుదీప్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఈ సినిమాను 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ పై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌లు ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌ర‌లోనే రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు