టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఫిబ్రవరి 2వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ చిత్రానికి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్రం చాలా అసాధారణమైన ముగింపుతో డిఫరెంట్ గా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో ప్రధాన జంటలో ఒకరు చనిపోతారని, ఇది చాలా ఎమోషనల్ వే లో ఉంటుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో చూడాలి. సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగా విలేజ్ పాలిటిక్స్, లవ్, క్లాస్ డిఫరెన్స్, ఇతర అంశాలను చర్చిస్తుంది. బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర సంగీతం అందించారు.