శ్యామ్ సింగరాయ్ లో నాని మరో డిఫెరెంట్ డైమెన్షన్!

Published on Oct 14, 2021 1:36 pm IST

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ ఈ రోజు సాయంత్రం రానుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన నాని డిఫెరెంట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ నేడు వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలపడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం లో నాని డిఫెరెంట్ డైమెన్షన్ ను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు చూపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలపడం జరిగింది. రివల్యూషన్ నుండి మార్పు చెందిన వ్యక్తి గా నాని కనబడే అవకాశం ఉంది. అయితే నేడు సాయంత్రం విడుదల కానున్న అప్డేట్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. జంగ సత్యదేవ్ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :