అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ సినిమా విశేషాలు !
Published on Nov 7, 2017 1:20 pm IST

‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ తో ‘సుప్రీమ్’ సినిమా తీసాడు. తాజాగా రవితేజ తో ‘రాజా ది గ్రేట్’ రూపొందించి మంచి సక్సెస్ లో అందున్నాడు. ఈ డైరెక్టర్ త్వరలో మరో సినిమా ప్రారంభించబోతున్నాడు. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ బయటకు వచ్చింది.

ఈ చిత్రం మల్టీ స్టారర్ గా ఉండనుంది. ఈ సినిమాకు ‘ఎఫ్ 2’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనేది ట్యాగ్ లైన్. ఫన్ చేసే పాత్రలో ఒక హీరో ఫ్రస్టేషన్ చూపే పాత్రలో మరో హీరో నటించనున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook