యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సెన్సేషన్ “దిగు దిగు దిగు నాగ” సాంగ్..!

Published on Oct 12, 2021 2:45 am IST


యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన “దిగు దిగు నాగ” అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ వస్తుంది. ఈ పాటకు ఇప్పటివరకు 20 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, శ్రేయా గోషల్ ఆలపించింది. థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :