“రావణాసుర” నుండి డిక్కా డిషుం సాంగ్ రిలీజ్!

Published on Mar 22, 2023 10:00 pm IST

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. ఏప్రిల్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక సాంగ్ ను మేకర్స్ విడుదల చేయడం జరిగింది.

డిక్కా డిషుం అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో అను ఇమ్మన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, సుశాంత్ ఈ చిత్రం లో మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :