టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన బాలీవుడ్‌లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా తర్వాత దిల్ రాజు మరో భారీ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కించనున్నారు.
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు అనీస్ బాజ్మీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారు. తొలుత ఈ చిత్రం టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు రీమేక్ అని వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఈ సినిమా కొత్త కథతో తెరకెక్కనుందని బీటౌన్ మీడియా చెబుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు అండ్ టీమ్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో విద్యా బాలన్, రాశి ఖన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
