మెగా హీరో సినిమాని మొత్తంగా కొనేసిన దిల్ రాజు !
Published on Dec 5, 2017 8:59 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘తొలి ప్రేమ’ చిత్రం చివరి దశ పనుల్లో ఉంది. టైటిల్, ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడం, తేజ్ గత చిత్రం ‘ఫిదా’ అఖండ విజయాన్ని అందుకొని ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో గట్టి నమ్మకాలు నెలకొన్నాయి. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కుల్ని కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది.

అది కూడా భారీ మొత్తాన్ని వెచ్చించి కొన్నారట. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫిబ్రవరి 9న విడుదలకానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook