ఇండస్ట్రీని వివాదాల్లోకి లాగొద్దన్న దిల్‌రాజు..!

Published on Sep 29, 2021 11:58 pm IST


టాలీవుడ్ సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు నేడు సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందనేది మంత్రి పేర్ని నానికి వివరించామని అన్నారు. చిత్ర పరిశ్రమపై కరోనా ప్రభావం, థియేటర్ల సమస్యలను గతంలోనే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

సినిమా టికెట్ల రేట్లను పెంచాలని, టికెట్లు ఆన్‌లైన్‌ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరామని, ఆన్‌లైన్‌ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందని అన్నారు. అయితే గత సమావేశంలోనే దీనిపై చర్చించామని, ఈ సమావేశ సారంశాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని, అందువల్లే తాజా పరిణామాలు జరుగుతున్నాయని దిల్‌రాజ్ అన్నారు. ఆన్‌లైన్ టికెట్లపై త్వరలో క్లారిటీ వస్తుందని అన్నారు. సినిమా అనేది సున్నితమైన అంశమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుందని, అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండని మీడియాను కోరుతున్నానని దిల్‌రాజ్ అన్నారు.

సంబంధిత సమాచారం :