సూపర్ డీల్ ను కుదుర్చుకున్న దిల్ రాజు

DIL-RAJU
తెలుగు సినీ నిర్మాణ రంగంలోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన నిర్మాత దిల్ రాజు బిజినెస్ పరంగా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. సినిమా పరంగా ఖచ్చితమైన జెడ్జిమెంట్ కలిగిన ఈయన నిర్మాణంలో కూడా పరిధులని పాటిస్తూ లాభాలను ఆర్జిస్తుంటారు. అంతేగాక సూపర్ హిట్ సినిమాలు రైట్స్ ను కొనుక్కుని ప్రాఫిటబుల్ బిజినెస్ చేయడంలో ఈయన దిట్ట. ప్రస్తుతం ఈయన వరుసగా ఐదు సినిమాలను నిర్మిస్తున్నారు.

వాటిలో ‘నేను లోకల్, శతమానం భవతి’, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ గా ఓ చిత్రం తో పాటు అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’, వరుణ్ తేజ్ ‘ఫిదా’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రసుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ ఐదు సినిమాలు ఓవర్సీస్ హక్కులని రూ.18.5 కోట్ల భారీ మొత్తానికి అమ్మాడట. దీంతో అందరూ దిల్ రాజు సూపర్ డీల్ కూర్చుకున్నాడే అనుకుంటున్నారు. ఈ డీల్ తో దిల్ రాజుతో భాగస్వామ్యంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి లాభాలు దక్కే అవకాశం ఉందట.