“ఎఫ్ 3” టికెట్ రేట్స్ పై బిగ్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.!

Published on May 18, 2022 1:00 pm IST

ఈ వేసవిలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధం అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో మరో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఎఫ్ 3” కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన బిగ్ హిట్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా కొనసాగింపు ఫ్రాంచైజ్ గా చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

మరి ఈ సినిమాపై అయితే నిర్మాత దిల్ రాజు ఒక బిగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఎలాంటి టికెట్ ధరల హైక్ తో రిలీజ్ చెయ్యడం లేదని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న సాధారణ టికెట్ రేట్స్ తోనే సినిమా రిలీజ్ అవుతుంది అని అందరు హ్యాపీగా చూడొచ్చని తెలిపారు. దీనితో ఈ సినిమా తోనే ఎలాంటి హైక్స్ లేకుండా రిలీజ్ ని తీసుకొస్తున్నారని చెప్పాలి. మరి ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు కూడా ఇదే ఫార్మాట్ లో వస్తాయో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :