మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ నిర్మాతల్లో స్టార్ నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్స్ ని తెలుగు సినిమాకి తెలుగు ఆడియెన్స్ కి అందించి అలరించాఋ. ఇలా లేటెస్ట్ గా ఈ సంక్రాంతి కానుకగా తన నిర్మాణంలో భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” అలాగే “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలతో వస్తున్నారు.
మరి ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో దిల్ రాజు పాల్గొనగా రీసెంట్ గానే నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ ని చేశారు. అయితే ఆ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. మరి ఈ వివాదంపైనే దిల్ రాజు లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు.
ఒక తెలంగాణా వాసిగా నిజామాబాద్ లో సినిమా ఈవెంట్ లు చాలా తక్కువ జరుగుతాయి అలాంటిది గతంలో ఫిదా సక్సెస్ మీట్ అలాగేఇపుడు మొదటిసారిగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేశామని. అయితే అక్కడ నేను తెలంగాణాలో చేసుకునే మన దావత్ ఆహారపు అలవాట్ల కోసం చెప్పిన మాటలు అవమానించేలా ఉన్నాయని కొంతమంది మిత్రులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి పెట్టారని తెలిసింది.
అయితే నేనెక్కడా మన కల్చర్ ని అవమానించలేదు అని అదంతా మిస్ అవుతున్నాను ఇపుడు తన రెండు సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక ఆ రీతిలో దావత్ చేసుకోవాలని అనిపించింది అని చెప్పానని తెలిపారు. అయితే ఈ విషయంలో నిజంగా ఎవరైనా బాధ పడి ఉంటే వారిని క్షమాపణలు కోరుతున్నా అని తెలిపారు. అలాగే ఒక తెలంగాణ వాసిగా మన తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలు “ఫిదా”, “బలగం” లు పొందిన ఆదరణ మన నేల కోసం తాను ఎలా ప్రపంచానికి చూపించి ప్రశంసలు అందుకున్నారో కూడా గుర్తు చేశారు.