తన కామెంట్స్ కాంట్రవర్సీపై దిల్ రాజు క్లారిటీ.!

తన కామెంట్స్ కాంట్రవర్సీపై దిల్ రాజు క్లారిటీ.!

Published on Dec 17, 2022 11:00 AM IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే కోలీవుడ్ లో కూడా డైరెక్ట్ గా ఓ చిత్రం చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో అయితే తమిళ నాట ఉన్న పోటీతో మాట్లాడుతూ అజిత్ సినిమాపై పలు కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది. మరి ఇదిలా ఉండగా దిల్ రాజు అయితే తన కామెంట్స్ కాంట్రవర్సీ పై ఓ సినిమా ఈవెంట్ లో క్లారిటీ ఇవ్వడం వైరల్ గా మారింది.

తాను మాట్లాడిన ఒక్క పాయింట్ మాత్రమే కట్ చేసి కొందరు చూపించారు అని నేను మొత్తం 40 నిమిషాల మేర ఇచ్చిన ఇంటర్వ్యూలో మిగతా ప్రశ్నలు మిస్ చేసి కేవలం వాటినే హైలైట్ చేయడం బాగోలేదని తెలిపారు. నేను అందులో ఎక్కడా ఎవరినీ తగ్గించలేదు ఎవరినీ పొగడలేదని అది మొత్తం చూస్తే అర్ధం అవుతుంది అని అయితే తాను ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే తన వారిసు సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు