ఓటీటీ కంటెంట్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ కసరత్తులు !

Published on Jul 10, 2022 12:30 am IST

దేశంలోనే అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం దిల్ రాజు చాలా చిత్రాల నిర్మాణాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పైగా దిల్ రాజు హిందీ చిత్రాలను కూడా నిర్మిస్తున్నాడు. అయితే , ఈ మెగా ప్రొడ్యూసర్ భవిష్యత్తులో మరిన్ని ఓటీటీ ప్రాజెక్ట్‌ల పై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాణ సంస్థలో పని చేసే సిబ్బంది నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఓటీటీ ప్రొడక్షన్స్ వైపు దిల్ రాజు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. ఒకపక్క బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. మరోపక్క మరిన్ని ఓటీటీ చిత్రాలను, సిరీస్ లను తెరకెక్కించే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు.

ఇప్పటికే ఓటీటీ మేకర్స్‌కు వినూత్న కంటెంట్ ను క్రియేట్ చేయడానికి దిల్ రాజు భారీ మొత్తాలను చెల్లిస్తున్నాడట. తక్కువ బడ్జెట్‌లో మరిన్ని హిందీ సినిమాలను మరియు ఓటీటీ కంటెంట్‌ను క్రియేట్ చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ప్రస్తుతం శంకర్‌ – రామ్ చరణ్ కలయికలో దిల్ రాజు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :