మెగా ఫ్యామిలీ నుంచి మరో హిట్ అందుకున్న దిల్ రాజు!

22nd, July 2017 - 09:44:41 AM


తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అంటే హాట్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు అని చెప్పాలి. వరుస్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ లాభాలు ఆర్జిస్తున్న ఈ నిర్మాతకి మెగా ఫ్యామిలీ సక్సెస్ సీక్రెట్ గా మారిపోయింది. దిల్ రాజు మెగా ఫ్యామిలీతో నిర్మించిన సుమారు అన్ని సినిమాలు అతనికి లాభాలు తెచ్చి పెట్టాయి. చివరిగా అల్లు అర్జున్ తో తీసిన సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న భాగా లాభాలు వచ్చినట్లు స్వయంగా నిర్మాతే చెప్పాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ రూపంలో దిల్ రాజుకి మరో హిట్ టికెట్ దొరికింది. ఇంత వరకు వరుణ్ తేజ్ కెరియర్ లో, ఇక దిల్ రాజు బ్యానర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా తాజాగా వచ్చిన ఫిదా మూవీ నిలిచే అవకాశం ఉందని క్రిటిక్స్ అంటున్నారు. మరి ఎ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అనేది త్వరలో తెలిసిపోయుంది. మొత్తానికి దిల్ రాజు బ్యానర్ మాత్రం మెగా ఫ్యామిలీకి భాగా రుణపడి ఉందని మాత్రం నిజం.